Dailyhunt
అలుపెరుగని పోరాటయోధుడు కాసం కృష్ణమూర్తి

అలుపెరుగని పోరాటయోధుడు కాసం కృష్ణమూర్తి

పువ్వుపుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టు కాసం కృష్ణమూర్తి బాల్యం నుంచి పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. ఐలమ్మ భూపోరాటం, ఆ తదుపరి సాగిన ఊరేగింపుపై దేశముఖ్‌ గుండాలు సాగించిన కాల్పులకు నేలకొరిగిన దొడ్డి కొమరయ్య ఉదంతం నుండి కృష్ణమూర్తి కార్యాచరణ, మండే కొలిమిలా గ్రామాల్లో ప్రజలను చైతన్యపర్చడం, అడవుల్లో దళాలు నడపడం, భూపోరాటం నిర్వహించడం, సంఘాన్ని విస్తరించడం, మిలటరీ క్యాంపులపై దాడి, ఆయుధాల సేకరణ ఆయన రోజువారీ కార్యక్రమం. అజ్ఞాతంలో ''రాగన్న''గా వెలుగొం దారు. ఇప్పటి ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆనాటి పోరాటస్మృతులు ప్రజల మదిలో ''రాగన్న''గా పేరు నేటికి మారుమోగుతోంది.

ప్రాణానికి ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియదు, ప్రాణం మీద తీపిని వదులుకునే ఈ విప్లవ ఉద్యమం లోకి ప్రవేశించిన కృష్ణమూర్తి జీవితం నేటి తరానికి ఆదర్శం. ఆ విప్లవోద్యమంలో అలు పెరుగని పోరాటయో ధుడిగా ఆయన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఫ్యూడల్‌ దురాగతాలకు ఎదురొడ్డి పోరాడిన ఉక్కు మనిషి కాసం కృష్ణమూర్తి. 01.08.2006 రోజున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి చెంది 14 ఏండ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఆయన పోరాట ఘట్టాలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.
నాడు తెలంగాణలో ఫ్యూడల్‌ రాచరిక పాలన కొనసాగుతున్న రోజులవి. జనగాం తాలూకా దేవరుప్పల మండలం నీర్మాల గ్రామం లో కృష్ణమూర్తి గారు మధ్య తరగతి కుటుం బంలో జన్మించారు. ఈ ప్రాంతం నాడు నల్లగొండ జిల్లాలో భాగముగా ఉండేది. కృష్ణమూర్తి గారి తండ్రి ఆ గ్రామ దేశ్‌ముఖ్‌ వద్ద పోలీసు పటేల్‌గా ఉద్యోగం చేసేవాడు. కృష్ణమూర్తి గారిని బాగా చదివించాలనే తపన తన తండ్రికి ఉండేది. 3వ తరగతి వరకు స్వగ్రామంలో చదివాడు. 5వ తరగతి వరకు జనగాంలో చదువు సాగించాడు. చదువులో దిట్ట, తెలివి గల విద్యార్థిగా పార్శీ, ఉర్థూ భాషల్లో కవిత్వాలు కూడా వ్రాయగలిగే స్థాయికి ఎదిగాడు. విద్యార్థిగా ఉన్న కాలములో అందరితో మంచి సంబంధాలు నెలకొల్పుకునే వారు. భారతం, భాగవతం, రామాయణం బాగా చదివేవా రు. అందులో శ్లోకాలు కంఠస్తం పట్టేవారు. చర్చాగోష్ఠుల్లో మంచి నైపుణ్యం, సమయోక్తిగా మాట్లాడడం అలవాటుగా మార్చుకున్నాడు. విద్యార్థి దశలో అభ్యుదయ భావాలు అలవర్చుకున్నాడు. గ్రామంలోని అన్ని వృత్తుల వారితో, అన్ని కులాల వారందరితో చనువుగా ఉండేవాడు. ఆటపాటల్లో చాలా హుషారుగా పాల్గొనేవారు. గ్రామంలో బడిఈ డు పిల్లలందరిని ఒక దగ్గరకు చేర్చి చదువు చెప్పేవారు. తన చిన్నతనంలో ఫ్యూడల్‌ వ్యవస్థే కాకుండా బానిస వ్యవస్థ అవశేషాలు మిగిలి ఉన్నాయి. గ్రామాల్లో పెత్తందారి తనం చెలా యించే భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు తమ ఇండ్లకాడ భోగం వేశాలతో నాటకాలు వేయిస్తూ ఆనందించేవారు. దేశముఖ్‌ల విలాసాలకు అయ్యే ఖర్చు జనం మీద నుండే బలవంతంగా వసూలు చేసేది. నాడు గ్రామాల్లో ఫ్యూడల్‌ రాచరిక పాలన, పైనేమో బ్రిటీష్‌ వారి పాలన ఈ రెండింటి తో ప్రజలు దుర్భరమైన బ్రతుకులు వెళ్ళదీసేవారు. ఆనాడు మధ్యయు గాల నాటి ఫ్యూడల్‌ వ్యవస్థ దానిపై ఆధారపడే కరుడుగట్టిన కులవ్యవస్థ ఉండేది. అప్పటి గ్రామాల్లో ఏ రాజకీయ కార్యకలాపాలు కూడా లేవు. బ్రిటీష్‌కు వ్యతిరేకంగా దేశంలో జాతీయోధ్యమ ప్రభావం, ఆర్య సమాజం వారు మాత్రమే సంఘ సంస్కరణలు ప్రచారం చేసేవారు. ఆ ప్రభావంతో కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలనే దోరణి ఆయనను ఆకర్షించింది.
బోనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభ వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. ఖమ్మంలో జరిగిన 12వ ఆంధ్రమహాసభ భూ బేదాఖళ్లకు వ్యతిరేకంగా ప్రతిఘటించా లన్న పిలుపును ఇచ్చింది. ఈ మహాసభ నాటికి తెలంగాణ ప్రాంతంలో భూ సమస్య అత్యంత ప్రధానమైనదిగా ముందుకొచ్చింది. జనగాం తాలూకాలో పాలకుర్తి ఐలమ్మ భూసమస్య, మొండ్రాయి, ధర్మాపురం లంబాడి రైతుల భూ సమ స్య ఈ పోరాటాలన్ని భూ సమస్యలను వెలుగులోకి తెచ్చాయి.
గెరిల్లా పోరాటం :-
సాయుధ పోరాటం ఆరంభంలో కా|| కృష్ణమూర్తి గారు జైలు నుంచి తప్పించుకొని పార్టీ పిలుపులో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తెలంగాణ పల్లెల్లోకి విస్తృతంగా తీసుకపోవాలని పిలుపునిచ్చిం ది. లెవి ధాన్యాన్ని వసూలు చేయకుండా అడ్డుకోవ డం, పటేల్‌, పట్వార్‌ల వద్ద గల రికార్డులను లాక్కో వడం, పన్ను వసూళ్ళు నిరాకరించడం, పన్నులు చెల్లించకుండా ఉండటం పెద్ద ఎత్తున సాగింది. ఒక వెళ్ళువలా ప్రజలు కదిలారా, దీంతో ప్రభుత్వం గడగడలాడిపోయింది. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని అణిచి వేయాలని పోలీసులు, రజాకారులను ఊర్ల మీదకు పంపింది. ఈ ముష్కరులు ఊర్ల మీద పడి దాడులకు ఉపక్రమించారు. ప్రభుత్వం సాయుధ దాడికి దిగేసరికి దానిని ప్రతిఘటించేందుకు తప్పని పరిస్థితుల్లో సాయుధ పోరును చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపధ్యంలో 1947లో ఆయుధాల సేకరణకు పార్టీ పిలుపునిచ్చింది. జాగీరుదార్లు, దేశ్‌ముఖ్‌ల గడీల మీద పడి ఆయుధాలు లాక్కోవడం సాయుధ గెరిల్లా పోరాటం ప్రారంభమైంది. మిలటరీ యాక్షన్‌ పూర్వం, గ్రామరాజ్యాలు వాటి పరిరక్షణకు గ్రామ దళాలు ఏర్పడ్డాయి. భూ పంపిణీ విస్తారంగా జరుగుతున్న కాలంలోనే ప్రతిఘటన శక్తి అనేక రెట్లు పెరిగింది. నిజాం రజాకారుల క్యాంపులను తుడిచిపెట్టే ట్రెండ్‌ బయలుదేరింది. దళం వేసే ప్రతి అడుగు జనం అండదండలు మెండుగా ఉన్నాయి. క్యాంపులనే లక్ష్యం చేసుకొని దాడులు మొదలయ్యాయి. మోత్కూరు, మొండ్రాయి, గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి రాజాకారుల, పోలీసుల క్యాంపులపై దళాలు చుట్టుముట్టి దాడి చేసి ఆయుధాలను సేకరించింది. దళాలన్ని ఒక పకడ్భంది వ్యూహంలో నడిచే విధంగా వ్యూహాలు రచించాడు. మోత్కూరు ప్రాంతంలో గడ్డం అమీన్‌ ఆగడాలు పెట్రేగిపోయాయి. గ్రామాల్లో రజాకారులతో కలిసి దాడి చేశారు. కృష్ణమూర్తి గారి దళం అమ్మనబోలుకు చేరుకొని అక్కడ ధాన్యాన్ని బండ్లపై పోలీసులు తీసుకవెళ్తుంటే ప్రతిఘటించి అట్టి ధాన్యాన్ని తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. దళాలన్ని చురుకుగా కదిలి పనిచేస్తున్న సమయంలో మోత్కూరు సమీపంలో బొడ్డుగూడెం గ్రామంలో అర్మీ వచ్చింది. కృష్ణమూర్తి గారిపై నిఘా పెట్టడంతో నిర్భందం పెరిగింది. రెండు, మూడు రోజుల పాటు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి దళ సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు. ఆయుధాలను జాగ్రత్త పరిచే విషయంతో పాటు ఆయుధాలను ఒక దగ్గర డంప్‌ చేసి ఆత్మరక్షణ కోసం కావల్సిన ఆయుధాలను దగ్గర ఉంచుకొని వ్యక్తులుగా తమను తాము ఎలా కాపాడుకో వాలో దళ సభ్యులకు వివరించారు. అక్కడ నుండి బయలుదేరి సెంటర్‌లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి గారులతో చర్చలు జరిపారు. సుందరయ్య గారితో కృష్ణమూర్తి గారు చర్చలు జరిపి తూర్పు బోనగిరి, మోత్కూర్‌ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, మిలటరీ దాడులు ప్రత్యేకంగా తమ ప్రాంతం మీద దాడులు కేంద్రీకృతమైన పద్ధతిని సవివరింగా కృష్ణమూర్తి గారు సుందరయ్య గారికి వివరించగా ఆయన దళాలను రక్షించుకోవడంపై కొన్ని సూచనలు చేశారు. దళాలన్నింటిని షర్భీ పక్కన బాగాయత్‌ (బాగాయత్‌ అంటే నైజాం స్వంత జాగీర్‌ ప్రాంతం, ఇప్పటి రంగారెడ్డి జిల్లా) ప్రాంతానికి రావాలని అక్కడ రక్షణ తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌ చుట్టూ ఉంటుంది. కృష్ణమూర్తి గారికి ఈ ప్రాంతంలో ఉండి కార్యకలాపాలు సాగించాలని రాచకొండ గుట్టల్లో రక్షణ తీసుకోవాలని సుందరయ్య గారు చెప్పారు. ఆయన సూచన మేరకు కృష్ణమూర్తి గారు రంగారెడ్డి జిల్లా రాచకొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దళాలను సిద్ధం చేసి గ్రామాల్లోకి వెళ్ళి ప్రదర్శనలు చేస్తూ ఆ ప్రాంతంలో ప్రజలు కమ్యూనిస్టులంటే భయపడేవారు అలాంటి ప్రజలదగ్గరకు వెళ్ళి ''సంఘం అంటే ఏమిటి'', ''కమ్యూనిస్టు పార్టీ ఏం చెబుతుంది?'', ''ఎవరి కోసం పోరాడుతుంది?'', మిలటరీ దాడుల నుండి రక్షణ తీసుకోవడం కోసం వచ్చాము, మాకు వ్యతిరేకంగా పెత్తందారులు చెప్పింది వినకండి అని ప్రజలందరిని ఒప్పించేందుకు కృషి చేశారు. గ్రామాల్లో ఒక నిర్మాణ యంత్రాంగాన్ని సృష్టించాడు.
విప్లవోద్యమంలో ఆయన నిర్మాణ దక్షత, పట్టుదల ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ప్రజల వెన్నంటే ఉండి ప్రజాఉద్యమాల ను జీవితంలో అంతర్భాగం చేసుకున్న గొప్ప పోరాట యోధుడు కాసం కృష్ణమూర్తి గారి 14వ వర్థంతి ఆగష్టు 1వ తారీఖున జరుపుకొని వారి ఆశయ సాధన కోసం మన అందరం పునరంకితం కావాలని వారికి విప్లవజోహారులు అర్పిస్తున్నాము.
- ములకలపల్లి రాములు
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
సెల్‌ : 9490098338

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana