నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు అరుదైన బోన్ క్యాన్సర్ సోకినందున, ఆయనకు తోడుగా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె శుక్రవారం వెల్లడించారు.
ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పంపిన తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె రాజీనామా జూన్ 30, 2026 నుంచి అమలులోకి వస్తుంది.
'నా భర్తకు ఇటీవల అరుదైన బోన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. రాబోయే రోజుల్లో ఆయన పెద్ద సవాళ్లను ఎదుర్కోనున్నారు. ఈ సమయంలో ఆయనకు అండగా ఉండేందుకు ప్రజా సేవ నుంచి నేను వైదొలగాల్సి వస్తోంది,' అని తులసి తన లేఖలో పేర్కొన్నారు. తులసి రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు ట్రంప్, ఆమె సేవలను ప్రశంసించారు. 'తులసి అద్భుతంగా పనిచేశారు, ఆమె లేని లోటు మాకు తెలుస్తుంది,' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరోన్ లూకాస్ తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తారని వైట్హౌస్ ప్రకటించింది.

