Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడి చేసే అవకాశం!

హైదరాబాద్ : అమెరికాపై మరోసారి అల్‌ ఖాయిదా దాడి చేసే అవకాశాలున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదికలు చెబుతున్నాయి. రానున్న 1,2 సంవత్సరాల్లో అమెరికాపై అల్‌ ఖాయిదా మరోసారి దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని తాజాగా బ్లూమ్‌బెర్గ్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ స్కాట్‌ బెరియర్‌ను ఉటంకిస్తూ నివేదికలో పేర్కొన్నారు.

ఇంటెలిజెన్స్‌ కాన్ఫరెన్స్‌లో లెఫ్టినెంట్‌ జనరల్‌ స్కాట్‌ బెరియర్‌ ప్రసంగించారు. తిరిగి అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని రకాల వనరులు, అవకాశాల కోసం ఆఫ్ఘనిస్తాన్‌లో అల్‌ ఖాయిదా మార్గాలను అన్వేషిస్తున్నదని చెప్పారు. అఫ్ఘనిస్థాన్‌ సమాచారం తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ పనికే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. చాలా కొరతగా ఉన్న వనరులను సమతుల్యం చేయడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో అల్‌ఖైదా తిరిగి కోలుకుంటోందని సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ కోహెన్ కూడా అంగీకరించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని సమకూర్చుకోవడానికి అల్‌ఖైదాకు రెండేండ్లు పట్టవచ్చునని డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ సెనేట్ కమిటీకి జూన్‌లో తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana