Tuesday, 03 Aug, 7.45 pm నవ తెలంగాణ

హోం
అనాధాశ్రమంలో దేవీశ్రీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్ : సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తన పుట్టిన రోజు వేడుకలను విజయవాడ, గన్నవరంలోని డాడీస్ హోం (అనాధాశ్రమం)లో సోమవారం జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుని వందలాది చిన్నారుల యోగక్షేమాలు చూసుకునే డాడీస్ హోంను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ పాపం తెలియని చిన్నారులకు వెలకట్టలేని సేవలు చేయడం తన హృదయాన్ని తాకిందని చెప్పారు. కొంతమంది చిన్నారులను స్పాన్సర్ చేస్తున్నానని ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top