Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

వతెలంగాణ-మిడ్జిల్ అంగన్ వాడీ టీచర్లు రోజు వారీ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సెల్ ఫోన్లను అందజేస్తుందని వా డ్యాల్ సర్పంచ్ చంద్రయ్య గౌడ్ , వల్లభూ రావు పల్లి సర్పంచ్ మహీన్ షేక్ జహంగీర్ అన్నారు.

శనివారం వాడ్యాల్ , వల్లభూ రావు పల్లి, గ్రామాలలో అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..పిల్లల హాజరు, పోషణ కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీల వివరాలు వంటి సమాచారాన్ని సకాలంలో నమోదు చేసి ప్రభుత్వానికి చేరవేయడానికి ఈ ఫోన్లు ఉపయోగపడతాయని చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సేవల నాణ్యతను పెంపొందించడంలో ఈ చర్య కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధు కుమార్, ఆయా గ్రామాల ఉప సర్పంచ్లు నాగరాజు, శ్రీను,మాజీ ఎంపీటీసీ నరసింహం, నవీన్, అంగన్వాడి టీచర్ మహీ ముద, వార్డు మెంబర్ ఉదయ్ కుమార్, బాలస్వామి.జంగయ్య తదితర పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana