Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అనుమానితులుగా తీసుకెళ్లి విచారణ అనంతరం పోలీసులు వదిలేశారు

వతెలంగాణ - బోనకల్ :దొంగతనాల కేసులో తమను అనుమానితులుగా నల్లగొండ జిల్లా పోలీసులు ఈనెల 15వ తేదీన తెల్లవారుజామున తీసుకెళ్లి విచారణ అనంతరం తనను వదిలేసారని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోనే చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన పాకాలపాటి మోహన్ రాయ్, పిల్లి రాహుల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

దొంగతనాల కేసులో నల్లగొండ పోలీసులు అనుమానితులుగా తమను తీసుకెళ్లారని తెలిపారు. అయితే ఆ దొంగతనాల కేసులో తమను నల్గొండ జిల్లా పోలీసులు విచారించారని తెలిపారు. విచారణలో తమకు దొంగతనాలు కేసులో సంబంధం లేదని పోలీసులు భావించి నాలుగు రోజుల అనంతరం తమను విడిచి పెట్టారని తెలిపారు. తమకు ఆ దొంగతనాల కేసుకు ఎటువంటి సంబంధం లేదని మోహన్ రాయ్, పిల్లి రాహుల్ ఆ ప్రకటనలో తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana