నవతెలంగాణ - మద్నూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమర్థవంతంగా పాలన కొనసాగడం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందడంతో ప్రజల్లో ఆనందం వెళ్లి విరుస్తోందని ఆవల్గావ్ గ్రామ సర్పంచ్ మాన్య బాయి అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ గ్రామ సభ సర్పంచ్ మాన్య బాయి అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామసభలో సర్పంచ్ ద్వారా స్వాగత్ ఉపన్యాసం పరిచయం కార్యక్రమం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ వినిపించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ కార్యదర్శి సతీష్ పథకాల అమలు గురించి ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ సమస్యలు పరిష్కారానికై చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామసభ లో ప్రత్యేక అధికారి ఏపీ ఓ పద్మ పాల్గొన్నారు. గ్రామ సభలో గ్రామసభ ప్రత్యేక అధికారి అయిన ఏపీవో పద్మకు సర్పంచ్ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ గ్రామ సభలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

