Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

​జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి టీడబ్ల్యూజేఎఫ్ వికారాబాద్ జిల్లా మహాసభలో :
ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య
నవతెలంగాణ-వికారాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని కోరారు. ఆదివారం టీడబ్ల్యూజేఎఫ్ విరారాబాద్ జిల్లా మహాసభ సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షఫీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి సమస్యలు పెండింగ్లో ఉండటంతో జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఎట్టకేలకు అక్రిడిటేషన్లు, ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాల్లో రెండు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరుగుతోందనీ, వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పని చేసే చోట నుంచి ఇంటివరకు రాత్రి పూట రవాణా వసతిని ఏర్పాటు చేయాలనీ కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రవేశపెడుతున్న నూతన హెల్త్ కార్డుల పథకాన్నీ జర్నలిస్తులకూ వర్తింప చేయాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల డిమాండ్లపై తీర్మానాలు చేశారు. ఈ మహాసభలో సీనియర్ జర్నలిస్టులు ఎం.రవీందర్, సంజీవ, రాంచందర్, వెంకట్ రాంరెడ్డి, పెద్దసంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

34 మందితో జిల్లా కమిటీ
టీడబ్ల్యూజేఎఫ్ వికారాబాద్ జిల్లా నూతన కమిటీని 34మందితో ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష‍ులుగా టి.రాంచందర్, కార్యదర్శిగా ఎండీ షఫీ, ఉపాధ్యక్షులుగా ఎ.ఆనంద్, మురళి గుప్తా, కె.కృష్ణగౌడ్, సి.శ్రీనివాస్, కె.పాండు, హఫీజ్, బీమాషాప్ప,సహాయ కార్యదర్శులుగా జి. మాణిక్యం, వెంకట్, బసవరాజ్, కృష్ణ, అనిల్, రాజు, మద్దులపల్లి అనిల్ కుమార్, కోశాధికారిగా బి. ప్రశాంత్ కుమార్, క్రీడల కార్యదర్శిగా వెంకట్, కార్యవర్గ సభ్యులుగా రమేష్, చంద్రశేఖర్, ఎన్. కుమార్, అజిజ్ అలీ, ఉదయ్, మహేందర్, ఏజాజ్, జగన్, అరుణ్, స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా ఎం.రవీందర్, బి.సంజీవ్, వెంకట్ రాంరెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా మాసాని వెంకటయ్య ఎన్నికయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana