Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసైన్డ్ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

అసైన్డ్ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

హుజన సేన జిల్లా ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింక శ్రీధర్నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ మరియు భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన నిరుపేద అర్హులకు కేటాయించిన ప్రభుత్వ అసైన్డ్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింక శ్రీధర్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్, ముష్టిపల్లిలోని సర్వే నంబర్ 51లో సుమారుగా రెండు ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని తెలిపారు.

ఆ ఫిర్యాదుపై అధికారులు చేసిన విచారణను ప్రజలకు తెలుపాలని కోరుతూ, మరియు తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమి స్థానికేతరులైన సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తిపై రిజిస్ట్రేషన్ అయి ఉండడం 1977 చట్టం నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు. అసైన్డ్ భూమి స్థానిక దళిత గిరిజన నిరుపేద అర్హులకు ప్రభుత్వం అందించాలని చట్టాలు సూచిస్తున్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా స్థానికేతరులు అసైన్డ్ భూమిని ఆక్రమించడంపై అధికారులు విచారణ జరిపి దళిత గిరిజన అర్హులైన నిరుపేద ప్రజలకు అందించాలని అధికారులను కోరారు. సమావేశంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్, బహుజన సేన గౌరవ అధ్యక్షులు గుడిసె మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు బానోత్ శ్రీకాంత్ నాయక్, యంగ్ మ్యాన్ అంబేద్కర్ రిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పెరుమండ్ల శ్రీకాంత్, పడిగె మహేష్, సిరిగిరి రాము, సుంకపాక వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana