Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అశ్వారావుపేటలో ఎస్ఐఆర్ డిజిటైజేషన్ 98.93 శాతం పూర్తి

అశ్వారావుపేటలో ఎస్ఐఆర్ డిజిటైజేషన్ 98.93 శాతం పూర్తి

- మొత్తం 1,60,221 మంది ఓటర్లలో 1,58,500 మంది వివరాలు నమోదు- ఇంకా 1,721 మంది ఈఎఫ్లు పెండింగ్
- ములకలపల్లి మండలం పూర్తి స్థాయిలో 100 శాతం నమోదు
నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గంలో తహశీల్దార్ దాసరి కిశోర్,డీటీ సయ్యద్ హుస్సేన్ పర్యవేక్షణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారమ్ (ఈఎఫ్) డిజిటైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి అందుబాటులో ఉన్న అధికారిక ట్రాకింగ్ నివేదిక ప్రకారం నియోజకవర్గంలోని మొత్తం 1,60,221 మంది ఓటర్లలో 1,58,500 మంది ఈఎఫ్ లు డిజిటైజ్ చేయబడ్డాయి.దీంతో 98.93 శాతం నమోదు పూర్తయింది. ఇంకా 1,721 ఈఎఫ్ లు డిజిటైజ్ కావాల్సి ఉంది.

నివేదిక ప్రకారం 1,43,715 ఈఎఫ్లు నేరుగా డిజిటైజ్ చేయగా, 14,785 సేకరించని (అన్కలెక్టబుల్) ఈఎఫ్లను కూడా నమోదు చేయడం ద్వారా మొత్తం డిజిటైజేషన్ పూర్తయింది. మండలాల వారీగా పరిశీలిస్తే ములకలపల్లి మండలం అన్ని పోలింగ్ భాగాల్లో 100 శాతం డిజిటైజేషన్ పూర్తి చేసి ముందంజలో నిలిచింది. చంద్రుగొండ మండలంలోనూ అత్యధిక భాగాలు 100 శాతం నమోదు సాధించగా, కొన్ని పార్ట్లలో మాత్రమే స్వల్ప పెండింగ్ ఉంది.

అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో చాలా పోలింగ్ భాగాల్లో 100 శాతం నమోదు పూర్తయినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో 90 నుంచి 99 శాతం మధ్య నమోదు కొనసాగుతోంది. ముఖ్యంగా దమ్మపేట, అశ్వారావుపేట పట్టణంలోని కొన్ని పోలింగ్ భాగాల్లో ఇంకా కొంతమంది ఓటర్ల ఈఎఫ్లు డిజిటైజేషన్కు మిగిలి ఉన్నాయి.

ఎన్నికల యంత్రాంగం చివరి దశలో పెండింగ్లో ఉన్న ఈఎఫ్లను పూర్తి చేయడానికి బీఎల్వోలు, సూపర్వైజర్లు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మిగిలిన 1,721 ఈఎఫ్లను త్వరితగతిన పూర్తి చేసి 100 శాతం డిజిటైజేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు కృషి చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana