Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపాల్

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపాల్

వతెలంగాణ-మద్నూర్ 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ అతిథి అధ్యాపకులుగా పనిచేయటానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఉమ్మడి నిజామాబాదు జిల్లా కో ఆర్డినేటర్ నీరడి గంగాశంకర్, ప్రిన్సిపాల్ ఏ సుధాకర్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హతగల అభ్యర్దులు మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో మే 30 లోపు దరఖాస్తులను చేసుకోవచ్చని చెప్పారు. విద్యాలయమునకు తెలుగు, హిందీ, ఆంగ్లము, గణితం, జీవశాస్త్రము, భౌతికశాస్త్రము, సాంఘికశాస్త్రము, కళాశాలకు, తెలుగు, ఆంగ్లము, గణితము, జీవశాస్త్రము, జంతుశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయన శాస్త్రములు బోధించుటకు అర్హతగల అభ్యర్దులనుండి దరఖాస్తులను కోరుతున్నామని చెప్పారు.

సంబంధిత విషయాలలో డిగ్రీ, పీజీ, బీఈడీ, తదితర అర్హలతో కూడిన ధ్రువపత్రాలను, వ్యక్తిగత బయోడేటాను మద్నూరు గురుకుల విద్యాలయంలో సమర్పించవచ్చని వెల్లడించారు. గురుకులం, కళాశాలలో పాఠాలను బోధించడమేగాక క్రమశిక్షణ, అంకితభావం, దృఢవిశ్వాసం, ఆత్మవిశ్వాసం, మానవీయ విలువలు మొదలగు సద్గుణములను పుణికిపుచ్చుకున్న అర్హతలు గల బోధనానుభవం గల పాత, క్రొత్త ఉపాధ్యాయులనుండి ఆహ్వానమును పలుకుచున్నామని చెప్పారు. అన్ని అర్హతలతో కూడిన ధ్రువపత్రాలతో ,లేటెస్టు పాస్ఫోర్టు సైజు ఒక ఫోటోతో ధరఖాస్తులను గురుకుల విద్యాలయములో సమర్పించాలని ప్రకటన ద్వారా తెలిపారు. ప్రధానంగా డెమో ,బోధనానుభవం ననుసరించి, గతంలోని ఫలితాల ననుసరించి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సి.హెచ్ రమణకుమార్ ఆదేశాల ననుసరించి, బోధన కమిటీ ,కో ఆర్డినేటర్, అకాడమిక్ గైడెన్స్ అధికారులు ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ ఆధారంగా ఉపాధ్యాయుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana