Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు వెళ్లొద్దు: తహశీల్దార్

అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు వెళ్లొద్దు: తహశీల్దార్

వతెలంగాణ - మల్హర్ రావుఅత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎండలో బయటకు వెళ్ళొద్దని మండల తహశీల్దార్ రవికుమార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుండే ఉష్ణోగ్రతలు పెరిగడం వలన వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పని పరిస్థితిల్లో బయటకు వెళ్లవలసి వస్తే తలపై టోపీ ధరించి వెళ్లాలని, సరిపోయినంతగా తాగునీరు, ద్రవపదార్థులు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నిమ్మరసం, మజ్జిగా, పండ్ల రసాలు వంటివి తీసుకుంటూ ఉండాలని సూచించారు. సన్నని వదులుగా ఉండే లేత రంగు దుస్తులు వాడటం, ధరించడం చేయాలని సూచించారు. ఎండలు అధికంగా ఉన్న సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. ఉదయం, సాయంత్రం సమయంలోనే బయటకు వెళ్లాలన్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, వయోవృద్ధులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana