Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయినా.. ఓటమే

అయినా.. ఓటమే

4-1తో అమెరికాపై బెల్జియం గెలుపు ఫిఫా 2026 ప్రపంచకప్

సియాటెల్ (యుఎస్ఏ)

మెరికా స్టార్ ఆటగాడు, ఫార్వర్డ్ ఫాలోరిన్ బాలోగన్ వివాదాస్పద ఫిఫా నిర్ణయంతో ప్రీ క్వార్టర్ఫైనల్లో ఆడినా..

ఆతిథ్య అమెరికాకు ఓటమి తప్పలేదు. రౌండ్ ఆఫ్ 32లో బోస్నియాతో మ్యాచ్లో బాలోగన్కు రెడ్కార్డ్ ఇవ్వగా, తర్వాతి మ్యాచ్లో నిషేధం పడింది. కానీ, అమెరికా అధ్యక్ష‍ుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని, ఫిఫా అధ్యక్ష‍ుడు జియానితో మాట్లాడటంతో.. క్రమశిక్ష‍ణ సంఘం అతడిపై నిషేధం ఎత్తివేయటంతో పాటు ఏడాదిపా ఆటోమెటిక్ సస్పెన్షన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఫిఫా నిర్ణయంపై బెల్జియం అప్పీల్కు వెళ్లినా.. అప్పీల్ను ఫిఫా తిరస్కరించింది. విమర్శలు, మాటల యుద్ధం నడుమ మొదలైన అమెరికా, బెల్జియం క్వార్టర్ఫైనల్ ఏకపక్ష‍ంగా ముగిసింది. ఆతిథ్య జట్టు ఒక్క గోల్ మాత్రమే కొట్టగా, అమెరికా స్టార్ ఫార్వర్డ్ బాలోగన్ను బెల్జియం డిఫెన్స్ కట్టడి చేసింది. 1-4తో ఓడిన అమెరికా.. ఫిఫా ప్రపంచకప్ రేసు నుంచి నిష్ర్కమించిన మూడో, ఆఖరు ఆతిథ్య దేశంగా నిలిచింది. బెల్జియం, స్పెయిన్ క్వార్టర్ఫైనల్లో తలపడనున్నాయి.

​బెల్జియం జోరు
ఆట మొదలైన తొలి పది నిమిషాల్లోనే బెల్జియం గోల్ ఖాతా తెరిచింది. నికోలస్ రస్కిన్ అందించిన పాస్ను డె కెటెలెరే గోల్గా మలిచాడు. దీంతో 9వ నిమిషంలోనే బెల్జియం 1-0తో ముందంజ వేసింది. 31వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్ను అమెరికా సద్వినియోగం చేసుకుంది. మార్క్ టిల్మాన్ చాకచక్యంగా ఫ్రీ కిక్ను గోల్గా మలిచి స్కోరు సమం చేశాడు. కానీ రెండు నిమిషాల వ్యవధిలోనే బెల్జియం మళ్లీ ముందంజలోకి దూసుకెళ్లింది. లియాండ్రో క్రాసార్డ్ అందించిన పాస్ను హెడర్ గోల్గా మలిచాడు. ద్వితీయార్థం ఆరంభంలో డి కెటెలెరే అమెరికా గోల్ కీపర్ను మాయ చేయగా.. పెనాల్టీ ఆవల నుంచి వానకెన్ గోల్ చేశాడు. సబ్స్టిట్యూట్గా గ్రౌండ్లోకి వచ్చిన రొమెలు లుకాకు 90+3వ నిమిషంలో గోల్ చేశాడు. దీంతో బెల్జియం 4-1తో అమెరికాపై ఏకపక్ష‍ విజయం సాధించింది.

​ఆగని మాటల యుద్ధం
ఫిఫా, యూఈఎఫ్ఏ మాటల యుద్ధం కొనసాగుతుంది. అమెరికా అధ్యక్ష‍ుడి జోక్యంతో ప్రపంచకప్ రెడ్కార్డ్ రూల్స్ను మార్చిన ఫిఫా లక్ష్మణ రేఖ దాటిందని యూఈఎఫ్ఏ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి ఫిఫా క్రమశిక్ష‍ణ సంఘం దీటుగా బదులిచ్చింది. యూఈఎఫ్ఏ లీగ్ల్లో రెడ్కార్డ్ సమీక్ష‍లు, క్రమశిక్ష‍ణ సంఘం నిర్ణయాలు వెనక్కి తీసుకోవటం జరగటం లేదా? అని ఎదురు ప్రశ్నించింది. ఫిఫా వివాదాస్పద నిర్ణయంపై మెజారిటీ ఫుట్బాల్ సంఘాలు మౌనంగా ఉండటంపై లాలిగా ప్రెసిడెంట్ జేవియర్ తెబాస్ విమర్శలు గుప్పించారు. బాధ్యతాయుత, రూల్స్ను గౌరవించే, పారదర్శకతతో కూడిన ఫుట్బాల్ బాడీ ప్రపంచానికి అవసరమని ఆయన అన్నారు. బాలోగన్ మ్యాచ్ సస్పెన్షన్ నిర్ణయంపై అప్పీల్ను బెల్జియం సవాల్ చేయగా ఫిఫా తిరస్కరించింది. కానీ ఈ అంశాన్ని కోర్డ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్కు తీసుకెళ్లేందుకు బెల్జియం సిద్ధమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana