Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
​బాధ్యతాయుతమైన జర్నలిజానికి ప్రతీక నవతెలంగాణ

​బాధ్యతాయుతమైన జర్నలిజానికి ప్రతీక నవతెలంగాణ

డీజీపీ సీవీ ఆనంద్ సందేశంనవతెలంగాణ 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

వతెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, పాత్రికేయులకు, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు.

ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం ఒక శక్తివంతమైన వ్యవస్థ. ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి చేర్చడం, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించటం, సామాజిక బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించడంలో మీడియాకు గొప్ప బాధ్యత ఉంది. పదేండ్లుగా నవ తెలంగాణ తనదైన సంపాదకీయ దృక్పధంతో ప్రజలకు చేరువై, సమకాలీన అంశాలపై నిర్మాణాత్మక చర్చలకు వేదికగా నిలుస్తూ, నూతన తెలంగాణ నిర్మాణంలో తనదైన పాత్రను పోషిస్తోంది. ఆ పత్రిక ప్రజా సమస్యల పట్ల అదే నిబద్ధత, వాస్తవాలను ప్రతిబింబించే బాధ్యతాయుతమైన జర్నలిజం, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే విలువలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా. మున్ముందు మరింతగా ప్రజల విశ్వాసాన్ని పొందుతూ, సమాజ హితాన్ని కోరుకునే వార్తలతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా. నవ తెలంగాణ దినపత్రికకు మరోసారి 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరెన్నో విజయాలు, మరింత ప్రజాదరణ, నిరంతర ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana