Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండ్లగూడలో హిట్ అండ్ రన్.. నవవధువు మృతి

బండ్లగూడలో హిట్ అండ్ రన్.. నవవధువు మృతి

వతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బండ్లగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువును డీసీఎం ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

భర్తతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్ స్కూటీని ఢీ కొట్టి ఆగకుండా పారిపోయాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana