Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్తీ దవాఖానలో రక్తహీనతపై అవగాహన

బస్తీ దవాఖానలో రక్తహీనతపై అవగాహన

వతెలంగాణ-రాయికల్పట్టణంలోని బస్తీ దవాఖానలో సోమవారం కిషోర బాలికలకు రక్తహీనత (అనీమియా), డయాబెటిస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్బీఎస్కే ఎంఓ డాక్టర్ కస్తూరి రేవతి మాట్లాడుతూ కిషోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

రక్తహీనత,షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులను అందిస్తున్నట్లు తెలిపారు.రక్తహీనత తీవ్రంగా ఉన్న బాలికలను మెరుగైన చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యుడు డాక్టర్ సబీర్ మొహమ్మద్,హెల్త్ సూపర్వైజర్ ఉమారాణి,స్టాఫ్ నర్స్ వసంత,ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు,మెప్మా ఆర్పీలు,కిషోర బాలికలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana