Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బతికుండగానే బకాయిలివ్వండి

బతికుండగానే బకాయిలివ్వండి

స్భవన్ ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల ధర్నాబకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
జిల్లాల్లో వాహనాల నిలిపివేత
అక్రమ అరెస్ట్లపై సంఘాల ఖండన

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తాము బతికుండగానే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులు ధర్నా చేశారు. మంగవారం వందలాదిగా హైదరాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఈ నిరసనలో పాల్గొన్నారు. పెక్సీలు ప్రదర్శించారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశాను. ప్రభుత్వం డౌన్, డౌన్ అంటూ గంటలతరబడి ధర్నాకు దిగారు. తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నాకు భారీ సంఖ్యలో రిటైరైన ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్భవన్ నుంచి విఎస్టీ రోడ్డు సాంతం కార్మికులతో నిండిపోయింది. కొంతసేపు ట్రాఫిక్జామ్ ఏర్పడింది. కొద్దిసేపు ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. అనంతరం ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ తోపాటు సివిల్ పోలీసులు జాగత్ర్తలు తీసుకున్నారు. 2017, 2021 పీఆర్సీ బకాయిలను చెల్లించాలనీ, 2003 నుంచి ఫీఎఫ్ వాటాను ట్రస్ట్కు బదిలీ చేయాలనీ, రిటైర్డ్ కార్మికులకు ప్రభుత్వం ఆసరా పింఛన్లను మంజూరు చేయాలనీ, తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలనీ, రిటైరైన దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలనీ, తార్నాక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిలంచాలని కోరారు. కొంతమంది కార్మికులు ఆర్థనగ్న పదర్శన చేశారు. ఇదిలావుండగా జిల్లాల నుంచి హైదరాబాద్ ధర్నాకు వస్తున్న ఉద్యోగులు, కార్మికులను ఆయా జిల్లాల సరిహద్దుల్లోనే అడ్డుకోవడాన్ని తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంపాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, రీజయన్ అధ్యక్షులు దంతూరి నర్సయ్య, కార్యదర్శి మహ్మద్ కలీముల్లా ఖండించారు. వాహనాల నిలిపివేతతోపాటు అక్రమ అరెస్ట్లను నిరసించారు. సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపే హక్కు లేదా ? ఇది ప్రజాస్వామ్యమా ? లేక నియంతృత్వమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana