Dailyhunt
భారత ఆర్మీ చేతికి వందలాది సూసైడ్ డ్రోన్లు

భారత ఆర్మీ చేతికి వందలాది సూసైడ్ డ్రోన్లు

వతెలంగాణ - హైదరాబాద్: భారత ఆర్మీలో వందలాది ఆత్మాహుతి డ్రోన్లు భాగమయ్యాయి. సూరత్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇన్సైడ్ఎఫ్పీవీతో రక్షణశాఖ గత డిసెంబర్లో రూ.10 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ కాంట్రాక్ట్లో భాగంగా కేవలం రెండు నెలల్లోనే ఆ కంపెనీ కామికేజ్ డ్రోన్లను అప్పగించింది. ఈ డ్రోన్లు గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. గరిష్ఠంగా 2.5 కి.మీ ఎత్తు వరకు ఎగరగలవు. 10కి.మీ దూరం ప్రయాణించగలవు. 2.5 కేజీల పేలుడు పదార్థాన్ని మోయగలవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana