Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత వృద్ధి 6.4 శాతమే!

భారత వృద్ధి 6.4 శాతమే!

వాషింగ్టన్ : పశ్చిమాసియా తీవ్ర సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తీసింది. ఇది అంతర్జాతీయంగా ఆర్థిక వృద్దిని మందగించేలా చేయడమే కాకుండా..

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచడంతో తీవ్ర అనిశ్చితిని సృష్టించింది. ఈ ప్రతికూల ప్రపంచ పరిస్థితుల కారణంగానే ఐక్యరాజ్యసమితి (యుఎన్) ఈ ఏడాది భారత వృద్ధి రేటును అంచనాను గతంలో వేసిన 6.6 శాతం నుంచి 6.4 శాతానికి కోత పెట్టింది. ప్రస్తుత అంతర్జాతీయ సవాళ్లు, ఆర్థిక ఒడిదొడుకుల నుండి భారత్కు మినహాయింపు ఏమీ లేదని యుఎన్ డిఇఎస్ఎ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగే ఇంధన ధరలు దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీనికి తోడు, అంతర్జాతీయంగా నెలకొన్న కఠిన ఆర్థిక పరిస్థితుల వల్ల దేశంలోకి వచ్చే విదేశీ నిధుల ప్రవాహం కూడా ప్రభావితమయ్యే ముప్పు ఉందని యుఎన్ పేర్కొంది. ఈ పరిణామాలతో 2026లో జిడిపి 6.4 శాతానికి పరిమితం కానుందని.. ఆ తర్వాత ఏడాది 2027లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చని పేర్కొంది. ప్రస్తుత ప్రతికూలతల వల్ల 2026లో ప్రపంచ దేశాల మొత్తం జిడిపి వృద్ధి రేటు కూడా 2.5 శాతానికి పడిపోనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇది జనవరిలో వేసిన అంచనా కంటే 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana