Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త

భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త

వతెలంగాణ - హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. సదరు దంపతులకు 21 ఏండ్ల క్రితం ప్రేమ వివాహం జరగ్గా, ప్రస్తుతం వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే, రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన, తనకంటే 13 ఏండ్ల చిన్నవాడైన యువకుడితో కలిసి సదరు మహిళ వెళ్ళిపోయింది. ఇటీవల ఆమె తిరిగి రావడంతో దంపతుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. భార్య మనసు మారకపోవడం, ప్రియుడితోనే ఉంటానని పట్టుబట్టడంతో భర్త ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇరువైపుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో సదరు యువకుడితో తన భార్యకు అధికారికంగా పెళ్లి జరిపించాడు. వివాహం అనంతరం వారిని సంతోషంగా పంపించివేశాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana