Saturday, 25 Sep, 6.45 pm నవ తెలంగాణ

హోం
భార్యపై కిరోసిన్ పోసి తగులబెట్టి..తానూ నిప్పంటించుకున్నాడు

హైదరాబాద్ : కుటుంబ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్త రోజూ గొడవపడుతున్నాడని భార్య పుట్టింటికి వెళ్లి కొన్ని నెలలు గడిచినా తిరిగి రాకపోవడంతో.. ఆగ్రహానికిలోనైన భర్త ఆమెపై కిరోసిన్ పోసి తగులబెట్టి ఆపై తాను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లా ఈషాపూర్ ధోభా గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫర్ధాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుత్నా గ్రామానికి చెందిన అజయ్ (28), రోమాదేవి (26) దంపతులు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య కుటుంబతగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం రోమాదేవి భర్తతో గొడవపడి ఈషాపూర్ ధోభాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో ఆగ్రహానికి గురైన అజయ్ శనివారం ఉదయం ఓ కిరోసిన్ క్యాన్ తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. రోమాదేవి కుటుంబసభ్యులు అజయ్ రాకను గమనించి అతను ఏం చేస్తున్నాడో గ్రహించేలోపే భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి, తానూ నిప్పంటించుకున్నాడు. మంటలను ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top