Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్యతో గొడవ..మద్యం మత్తులో ఉరి

భార్యతో గొడవ..మద్యం మత్తులో ఉరి

వతెలంగాణ - తుంగతుర్తి: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని బాపన్ భాయ్ తండ స్టేజ్ దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండ గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన వస్త్రం తండకు చెందిన భూక్య పంతులుగా తెలిపారు.

మృతుడు తన కుటుంబంతో మానపురం గ్రామంలోని వివాహ కార్యక్రమానికి వెళ్లి, అక్కడ భార్యతో గొడవపడి, మద్యం మత్తులో తిరిగి వస్తూ మార్గమధ్యంలో బాపన్ భాయ్ స్టేజి వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు లుంగీతో ఉరేసుకుని చనిపోయినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు భూక్య వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana