Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్ ముందస్తు బెయిల్పిటిషన్ తిరస్కరణ

భగీరథ్ ముందస్తు బెయిల్పిటిషన్ తిరస్కరణ

వతెలంగాణ బ్యూరో-హైదరాబాద్​హైదరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించు కునేందుకు హైకోర్టు అను మతి ఇచ్చి, ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది.

ఈ నెల 8న పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. అనంతరం పరారీలో ఉన్న భగీరథ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మాధవీదేవి గత శుక్రవారం అర్ధరాత్రి విచారణ నిర్వహించి తీర్పును రిజర్వులో ఉంచారు. తీర్పు వెలువడే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని భగీరథ్ తరఫు న్యాయవాది చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో శనివారం భగీరథ్ పోలీసుల అదుపులోకి వెళ్లారు. తనను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులు ఇవ్వడం ప్రయోజనం ఉండదని పేర్కొంటూ, పిటిషన్ను ఉపసంహరించు కునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు లేఖ సమర్పించారు.

ఈ అభ్యర్థనపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సంబంధిత దిగువ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను పిటిషనర్కు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ​నౌహీరా షేక్కు చుక్కెదురు పెట్టుబడిదారులను మోసం చేశారంటూ ఈడీ నమోదు చేసిన కేసులో నిందితురాలు నౌహీరా షేక్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈడీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ అమలును నిలిపివేతకు నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ ఈవీ వేణుగోపాల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 7న ఈడీ ప్రత్యేక కోర్టు నౌహీరా షేక్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తులను వేలం వేసి బాధితులకు ఇచ్చేందుకు పిటిషనర్ సిద్ధంగా ఉన్నారని, విచారణకు సహకరిస్తున్నారని, ఎన్బిడబ్ల్యూను రద్దు చేయాలని న్యాయవాది కోరారు. దీనిపై హైకోర్టు, దిగువ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈడీకి నోటీసులు ఇచ్చి విచారణను వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana