Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలి..

భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలి..

- ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డినవతెలంగాణ - ఊరుకొండ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ చక్కని విద్యను అందిస్తున్న తరుణంలో మండలంలో మొదటి ర్యాంకు సాధించిన నౌషిన్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆకాంక్షించారు.

శనివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి పదవ తరగతిలో చక్కని ప్రతిభ కనబరిచి ఊరుకొండ మండలంలో ప్రభుత్వ పాఠశాల విభాగంలో మొదటి స్థానం మరియు జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించిన ఎండి.నౌషిన్ ను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అభినందించడంతోపాటు శాలువాతో సత్కరించి మేమంటోను బహుకరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్, మండల విద్యాధికారి అబ్దుల్ రహీం, పాఠశాల ఉపాధ్యాయులు శివకుమార్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana