Dailyhunt
భిన్న కాన్సెప్ట్తో 'సైరా భాను'

భిన్న కాన్సెప్ట్తో 'సైరా భాను'

ది సాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హాస్య మూవీస్ బ్యానర్పై నిర్మాత రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన బంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు.
'సైరాబాను' అనే ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆకట్టుకునే పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ డిజైన్ ఉత్సాహభరితమైన రొమాంటిక్ వాతావరణాన్ని ప్రజెంట్ చేస్తోంది. ఫణి కృష్ణ సిరికి, రాజమండ్రి, హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథనంతో, హాస్యం మేళవించి ఒక ప్రత్యేకమైన హిందూ-ముస్లిం ప్రేమకథను రూపొందించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ శుక్రవారం పూజా కార్యక్రమంతో గ్రాండ్గా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టారు. దర్శకుడు రామ్ అబ్బరాజు, సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట్, కే రాంప్ డైరెక్టర్ నాని మేకర్స్కి స్క్రిప్ట్ అందించారు. తొలి సన్నివేశానికి దర్శకుడు యోగి గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం - ఫణి కృష్ణ సిరికి, డిఓపి - రామ్ రెడ్డి, సంగీతం - శేఖర్ చంద్ర, ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -కె. అప్పాజీ, లైన్ ప్రొడ్యూసర్ - కిరణ్ పోపూరి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana