Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూతల దాడి దుస్సాహసమే

భూతల దాడి దుస్సాహసమే

మెరికా వ్యూహాలకు ఎదురుదెబ్బేవాషింగ్టన్ : ఇరాన్పై అమెరికా భూతల దాడులకు దిగుతుందా? ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇరాన్ను కట్టడి చేసేందుకు అమెరికా పరిశీలిస్తున్న దాడులలో ఇది కూడా ఒకటి.

అయితే ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమని, ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉంటుందని అమెరికా నిఘా, భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఇరాన్పై భూతల దాడులకు ట్రంప్ లక్ష మంది సైనికులను మోహరించినప్పటికీ వారిలో ఇరవై వేల మందిని కోల్పోయే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు హెచ్చరించారు. అయితే అమెరికాకు జరిగే ప్రాణనష్టం ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని ఇరాన్ చెబుతోంది. పైగా ట్రంప్ సేనలు విజయం సాధిస్తాయన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. అనిశ్చితి, అనూహ్య పరిణామాలు ఉన్నప్పటికీ అమెరికా ఇప్పటి వరకూ పరీక్షించని ఏకైక సంప్రదాయ పోరు భూతల దాడే.

ఆత్మహత్యా సదృశం
ఇరాన్పై పోరులో ట్రంప్, ఆయన మిత్రులు ఇప్పటి వరకూ భూతల దాడులు మినహా మిగిలిన అన్ని రకాల యుద్ధ పద్ధతులను ప్రయత్నించారు. కానీ అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇరాన్పై భూతల దాడులకు అమెరికా సన్నా హాలు చేస్తోందని కొన్ని వర్గాలు చెబుతున్నప్పటికీ అది వ్యూహాత్మక ఒత్తిడి లో భాగమేనని విశ్లేష కులు వ్యాఖ్యానించా రు. యుద్ధం తిరిగి ప్రారంభమైతే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మరోసారి పూర్తిగా మూసేస్తుంది. ఫలితం గా ఇంధన సంక్షోభం తలెత్తుతుంది. తీవ్రమైన పర్యావసానాలు ఎదుర వుతాయని తెలిసినప్పటికీ అమెరికా భూతల దాడులకు తెగబడుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. అలాంటి చర్య నిస్సందే హంగా ప్రమాదకరమే. ఇరాన్పై భూతల దాడి జరపాలని ట్రంప్, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేథ్ నిర్ణయిస్తే అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది.

ఓటమి 
ఖాయం
ఏ విధంగా చూసినా భూతల దాడులు చేస్తే ఓటమి పొందేది అమెరికాయేనని స్పష్టమవుతోంది. ప్రస్తుత సంఘర్షణను దీర్ఘకాలం కొనసాగించడం అమెరికా పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆయుధ సామగ్రి కొరత, ధ్వంసమైన రాడార్ వ్యవస్థలు, దెబ్బతిన్న సైనిక స్థావరాలు అమెరికా విజయావకాశాలను నీరుకారుస్తాయి. దాని ఓటమిని ఖరారు చేస్తాయి. అయినప్పటికీ ట్రంప్ నిర్ణయాలు, చర్యలను ముందుగా ఊహించడం కష్టమే. భూతల దాడులతో అమెరికా విజయం సాధించే అవకాశాలు లేనప్పటికీ ఆ తరహా యుద్ధం జరగదని గ్యారంటీ ఏదీ ఇవ్వలేము.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana