Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భువనేశ్వర్లో 
కాంటినెంటల్ టూర్

భువనేశ్వర్లో 
కాంటినెంటల్ టూర్

నెల 
22న 
18 క్రీడాంశాల్లో పోటీలున్యూఢిల్లీ : భారత అథ్లెటిక్స్కు చిరునామాగా మారేందుకు భువనేశ్వర్ మరో అడుగు ముందుకేసింది. గత ఏడాది కళింగ స్టేడియంలో ఇండియన్ ఓపెన్ వరల్డ్ అథ్లెటిక్స్ బ్రాంజ్ లెవల్ టోర్నమెంట్ నిర్వహించగా..

తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఈ టోర్నమెంట్ స్థాయిని పెంచింది. దీంతో ఈ ఏడాది ఇక్కడ కాంటినెంటల్ సిల్వర్ లెవల్ టోర్నమెంట్ జరుగనుంది. స్థాయి పెరగటంతో ఇక్కడ పోటీపడిన అథ్లెట్లకు కేటగిరీ బీ పాయింట్లు దక్కనుండగా, ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రభావం చూపుతుంది. ఈ నెల 22న జరుగనున్న కాంటినెంటల్ సిల్వర్ లెవల్ టోర్నమెంట్లో 18 క్రీడాంశాలకు వరల్డ్ అథ్లెటిక్స్ అనుమతి ఇచ్చింది. పురుషుల విభాగంలో 100మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 5000మీటర్లు, 110మీటర్ల హార్డిల్స్, హై జంప్, లాంగ్జంప్, షాట్పుట్, జావెలిన్ త్రో ఉండనుండగా.. మహిళల విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్లు, 5000మీటర్లు, 100 మీటర్ల హార్డిల్స్, హై జంప్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో ఉండనున్నాయి. గత ఏడాది బ్రాంజ్ లెవల్ టోర్నమెంట్లో ప్రైజ్మనీ రూ.25 లక్షలు కాగా.. తాజాగా సిల్వర్ లెవల్ టోర్నమెంట్కు ప్రైజ్మనీ రూ.75 లక్షలు ఇవ్వనున్నారు. 2028 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్తో పాటు అదే ఏడాది ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు సైతం భువనేశ్వర్ వేదికగా నిలువనున్న సంగతి తెలిసిందే.

బరిలో స్టార్ అథ్లెట్లు
భువనేశ్వర్ కాంటినెంటల్ సిల్వర్ లెవల్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు పోటీపడనున్నారు. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్లో ఆ నెల 21న పోటీపడనున్నాడు. దీంతో అతడు ఈ ఈవెంట్లో పోటీపడటం లేదు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన మురళీ శ్రీశంకర్, యశ్ వీర్ సింగ్, గుల్వీర్ సింగ్, సీమా కలిరామా, సర్వేశ్లు ఇక్కడ పోటీపడనున్నారు. ప్రస్తుతం భారత అథ్లెటిక్స్ బృందం పొలాండ్లో శిక్షణ పొందుతుంది. అక్కడ్నుంచి నేరుగా భువనేశ్వర్కు చేరుకుని పోటీల్లో పాల్గొంటారు. పోటీల అనంతరం అక్కడే ఆసియా క్రీడల శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఆసియా క్రీడలకు భువనేశ్వర్ నుంచే అథ్లెటిక్స్ బృందం బయల్దేరి వెళ్లనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana