Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

వతెలంగాణ - నాచారం : మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను మరింత విస్తరించేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువై పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని సభ్యత్వాల రూపంలో మరింత పెంచాలని కోరారు. ఈ సమావేశంలో మల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, వాసు గౌడ్, ధర్మారెడ్డి, పండు, శివన్న, అమాలి శ్రీనన్న, కోటేశ్వరి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana