Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీని గద్దెదింపే వరకు పోరాడుతాం

బీజేపీని గద్దెదింపే వరకు పోరాడుతాం

ఢిల్లీ విద్యార్థుల పోరాట స్పూర్తితో ఉద్యమించాలిసీపీఐ జాతీయ కార్యదర్శి, 
మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి
హనుమకొండలో సీపీఐ పాదయాత్ర , భారీ ప్రదర్శన

నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సీపీఐ పోరాటం కొనసాగిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వెయ్యి స్థంబాల దేవాలయం నుంచి హనుమకొండ చౌరస్తా మీదుగా పబ్లిక్ గార్డెన్ వరకు ప్రదర్శన కొనసాగింది. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశంలో మార్పు కోసం ఆగష్టు 6న జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర వారం రోజుల పాటు జిల్లాలో కొనసాగింది. మంగళవారం ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పల్లా వెంకట్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహిస్తుందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలే దాని పతనానికి దారి తీస్తాయన్నారు. దేశంలో మార్పు కోసం సీపీఐ పోరాటం సాగిస్తోందని తెలిపారు. బీజేపీ పన్నెండేండ్ల పాలనలో ప్రజలకు ఉపయోగకరమైన ఏ ఒక్క మంచి పని చేయలేక పోయిందని విమర్శించారు. ధరలను అరికట్టడంలో, ఉద్యోగాల కల్పనలో విఫలమైందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా దానికి నియోజకవర్గాల పునర్వి భజన బిల్లును జోడించి ఆమోదింప జేసుకోవడానికి కుట్ర పన్నారన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలు అనేక మార్లు లీక్ అయి లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని క్రమబద్ధంగా దెబ్బతీస్తోందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, సాధారణ పౌరులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడంలో విఫలమైందని విమర్శిం చారు. రైతు సంక్షేమాన్ని దెబ్బతీశారని, ఉపాధి హామీని నిర్వీర్యం చేశారన్నారు. సహజ వనరులను కార్పొరేట్ మిత్రులు అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జైల్ భరో కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతమైందన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. ''విద్యా, ఆరోగ్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలి. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి.
ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి. మహిళా రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి. కార్మికుల హక్కులను హరిస్తూ కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ'' ఆయన డిమాండ్ చేశారు. డిల్లీ విద్యార్థుల పోరాట స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

దళితులు, మహిళలపై పెరిగిన దాడులు : 
తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై, మహిళలపై అకృత్యాలు, దాడులు పెరిగాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్తంగా సీపీఐ పాదయాత్రలు చేపట్టిం దన్నారు. తెలంగాణలో వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల మీదుగా సాగుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ పాద యాత్ర కొనసాగిందని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో దేశంలో మార్పు కోసం మహా ర్యాలీతో యాత్ర ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్ రాష్ట్ర నాయకులు టి. వెంకట్రాములు, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, ఎన్ఎ స్టాలిన్, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, బత్తిని సదానందం, బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి, ఏదునూరి వెంకట్రాజం, వేల్పుల సారంగపాణి, నేదునూరి రాజమౌళి, నకీర్త ఓదెలు, యేషబోయిన శ్రీనివాస్, మాలో తు శంకర్, మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana