Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్లాస్టింగ్ దెబ్బలతో కూలిన మరో ఇళ్లు..!

బ్లాస్టింగ్ దెబ్బలతో కూలిన మరో ఇళ్లు..!

వతెలంగాణ - మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచర్లలోని కాపురంపల్లి ఓసిపి బ్లాక్-1బ్లాస్టింగ్ దెబ్బలతో డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,ఇంటిగోడలు పగుళ్లు తేలడమే కాక కులుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాడిచెర్ల ఎస్సీ కాలనీకి చెందిన తాండ్ర సదానందం చెందిన ఇల్లు బ్లాస్టింగ్ దెబ్బల ప్రభావంతో పాక్షికంగా కూలి పోయింది. బ్లాస్టింగ్ దెబ్బలతో డేంజర్ జోన్లో ఇండ్లు, గోడలు పగిలిపోవడం, పైకప్పులు చీలిపోవడం, ఇండ్లలోకి దుమ్ము,దూళి చేరుతోందని నిర్వాసితులు బండి సుధాకర్, రాజ్ కుమార్,తాండ్ర సదయ్య వాపోతున్నారు. ఇండ్లు, ఇంటి గోడలు కూలిన నిర్వాసితులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితుల ఇళ్లు రోజురోజుకూ కూలిపోతున్నా జెన్కో,రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మరింత ప్రమాదం జరగకముందే ప్రభుత్వం, జెన్కో ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana