Thursday, 31 Jan, 3.47 am నవ తెలంగాణ

ఖమ్మం
బోనకల్ మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నవతెలంగాణ-బోనకల్‌
బుధవారం జరిగిన మూడో విడత పంచా యతీ ఎన్నికలు బోనకల్‌ మండలంలో ప్రశాతంగా ముగిశాయి. మొత్తం 22గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మండలంలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
ఏడు పంచాయతీల్లో సీపీఐ(ఎం) అభ్యర్థుల గెలుపు.. :
మండల వ్యాప్తంగా మొత్తం ఏడు పంచాయ తీల్లో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులు గెలిచా రు. తూటికుంట్ల, నారాయణపురం, చిన్నబీరవల్లి, పెద్దబీరవల్లి, మోటమర్రి, ఆళ్లపాడు గ్రామపంచా యతీల్లో గెలుపొందారు.
ఓటమి పాలైన మాజీ సర్పంచ్‌లు : మండలంలో ముగ్గురు మాజీ సర్పంచ్‌లు ఓటమి పాలయ్యారు. చిరునోములలో 4వ వార్డు నుంచి పోటీ చేసిన శాఖమూరి రాజశేఖర్‌ ఓటమిపాలయ్యాడు. చిరునోముల గ్రామపంచాయతీకి రెండు సార్లు పంచాయతీ సర్పంచ్‌గా పని చేశాడు. ఈ ఎన్నికలలో వార్డుమెంబర్‌గా పోటీ చేసి ఓటమిచెందాడు. బోనకల్‌లో మాజీ సర్పంచ్‌లుగా పని చేసిన పోటు వెంకటేశ్వర్లు, చావా వెంకటేశ్వరరావు వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మండలంలో ఇంకా అనేక గ్రామపంచాయతీలలో రాజకీయ నాయకులు ఓటమి పాలయ్యారు.
బ్రాహ్మణపల్లిలో ఎన్నికలను పరిశీలించిన రాష్ట్ర అబ్జర్వర్‌
మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఎన్నికల సరళిని జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌ కె.నిర్మల పరిశీలిం చారు. ఎంపీడీఓ గొట్టిపాటి శ్రీదేవిని మండలంలో జరుగుతున్న ఎన్నికల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోనకల్‌ పోలింగ్‌ కేంద్రంలో జిల్లా సబ్‌కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఎన్నికల సరళిని పరిశీలించారు.
మండలంలో 95శాతం పోలింగ్‌ నమోదు : మండలంలో 22 గ్రామపంచాయతీల్లో మొత్తం 95.27శాతం పోలింగ్‌ నమోదైంది. మండల వ్యాప్తంగా 32,978ఓట్లకు గానూ 31,418 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా చొప్పకట్లపాలెంలో 98.40శాతం నమోదు కాగా రావినూతలలో అతి తక్కువగా 92.63 శాతం నమోదైంది. మొత్తంగా మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
గ్రామం సర్పంచ్‌ పేరు పార్టీ మెజార్టీ

తూటికుంట్ల ఎన్‌.వెంకటనర్సమ్మ సీపీఐ(ఎం) 86ఓట్ల
లక్ష్మీపురం నన్నక లక్ష్మి కాంగ్రెస్‌ 107
గోవిందాపురం (ఎల్‌) ఉమ్మనేని బాబు కాంగ్రెస్‌ 20
గార్లపాడు దారెల్లి నర్సమ్మ కాంగ్రెస్‌ 100
రామాపురం కొండపు వేణు టీఆర్‌ఎస్‌ 34
రావినూతల కొమ్మినేని ఉపేందర్‌ టీఆర్‌ఎస్‌ 130
బోనకల్‌ భూక్య సైదానాయక్‌ టీఆర్‌ఎస్‌ 91
చిరునోముల ములకారపు రవి కాంగ్రెస్‌ 238
చొప్పకట్లపాలెం యర్రంశెట్టి సుబ్బారావు కాంగ్రెస్‌ 72
ముష్టికుంట్ల షేక్‌ బిజాన్‌బి టీఆర్‌ఎస్‌ 24
జానకీపురం చిలక వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌ 73
నారాయణఫురం సాధినేని చంద్రకళ సీపీఐ(ఎం) 124
చిన్నబీరవల్లి తేరబత్తిని శాంతయ్య సీపీఐ(ఎం) 173
పెద్దబీరవల్లిలో ఆళ్ళ పుల్లమ్మ సీపీఐ(ఎం) 401
సీతానగరం మాలెంపాటి వాణి కాంగ్రెస్‌ 01
రాపల్లి ఎం.తిరుమల్‌రావు టీఆర్‌ఎస్‌ 420
బ్రాహ్మణపల్లి జెర్రిపోతుల రవి టీఆర్‌ఎస్‌ 87
రాయన్నపేట కిన్నెర వాణి టీఆర్‌ఎస్‌ 250
మోటమర్రి కేతినేని బిందు సీపీఐ(ఎం) 240
ఆళ్ళపాడు మర్రి తిరుపతిరావు సీపీఐ(ఎం) 13
గోవిందాపురం(ఎ) భాగం శ్రీనివాసరావు టీడీపీ 216
కలకోట యెంగల దయామణి కాంగ్రెస్‌

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top