Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాంకుకు రూ.1.56 కోట్లు టోకరా వేసిన క్యాషియర్​

బ్యాంకుకు రూ.1.56 కోట్లు టోకరా వేసిన క్యాషియర్​

విజయవాడ: ఒక జాతీయ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న గుండ్ర రవితేజ అనే వ్యక్తి చివరుకు అదే బ్యాంకులో రూ. 1.56 కోట్లు టోకరా వేశాడు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గుండ్ర రవితేజ నూజివీడు పట్టణంలో 2017 నుంచి బ్యాంకులో హెడ్ క్యాషియర్గా పని చేస్తున్నాడు. అయితే అతను ఇటివల కాలంలో ఆన్లైన్లో రమ్మీ, కాసినో ఆడటానికి అలవాటు పడ్డాడు. దీంతో అందుకు అవసరమైన డబ్బును బ్యాంకు డబ్బు నుండి రూ. 1.56,56,807ని తన ఖాతాకు బదిలీ చేసుకొని రమ్మీ, కాసినోల కోసం ఉపయోగించాడు. బ్యాంకు చీఫ్ మేనేజర్ (విజయవాడ సర్కిల్) ఎం. నాగేశ్వరరావు బుధవారం నగదు తనిఖీ చేయగా...

ఈ విషయం బయటపడింది. ఈ మేరకు నూజివీడు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana