Dailyhunt
చలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విజయవంతం చేయండి

చలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విజయవంతం చేయండి

వతెలంగాణ - ఆర్మూర్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏప్రిల్ 6 న ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ నాయకులు వినోద్ లు తెలిపారు.

పట్టణ కేంద్రంలో కుమార్ నారాయణ భవన్ లో గురువారం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం గాకముందే ముందస్తు పేరుతో అడ్మిషన్ల చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థ పై కఠిన చర్యలు తీసుకోవాలి స్థానిక ఎంఈఓ డిఈఓ లకు తెలిసిన నిమ్మకు నీరు ఎత్తన్నట్టు వ్యవహరిస్తున్నారు అనే వారన్నారు. దీన్ని చూస్తుంటే అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయని మాకు అర్థమైత ఉన్నది ఇకనైనా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు పేరుతోనే అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో మునుముందు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి హెచ్చరిస్తున్నాం అట్లాగే ఈనెల హైదరాబాద్లో జరిగే ఇంటర్ బోర్డ్ ఎదుట ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ దుర్గాప్రసాద్ , ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు , సహాయ కార్యదర్శి సిద్దు , నాయకులు ప్రణయ్ చిన్న గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana