Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చండేగావ్ జిపి గ్రామంలో ఇందిరమ్మ గృహలను పరిశీలించిన ఎంపీడీవో

చండేగావ్ జిపి గ్రామంలో ఇందిరమ్మ గృహలను పరిశీలించిన ఎంపీడీవో

వతెలంగాణ - జుక్కల్ : మండలంలోని చెండేగావ్ గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను ఎంపిడిఓ శ్రీనివాస్ గురువారం స్థానిక సర్పంచ్ బ్రాండెడ్ వార్ లక్ష్మణ్ తో కలిసి పరిశీలించారని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు గృహాలు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి ప్రారంభోత్సవాలు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసుకున్న ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు వారి ఖాతాలో మూడు విడతలుగా డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు.

ఎవరికైనా డబ్బులు రాని వారి ఉంటే తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామం శివారులో ఉపాధి హామీ పథకంలో కూలీలు చేపడుతున్న కాలువ తవ్వకాల పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. కూలీలకు పని సూచనలు చేశారు. ఉపాధి కూలీలు ఉదయం ఏడు గంటల లోపు పని ప్రదేశంలో ఉండాలని వారికి త్రాగునీరు, నీడ ఏర్పాటు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ కు ఆదేశించారు. గ్రామంలో సెన్సెస్ సర్వే నిర్వహిస్తున్న పనితీరును పరిశీలించారు. సెన్సెస్ సర్వీస్ చేస్తున్న అధికారులను ప్రతి ఒక్క అంశాలను పకడ్బందీగా నిజాయితీగా సర్వేలో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి, సెన్సెస్ సర్వే చేస్తున్న అధికారులు, జిపి పాలకవర్గ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana