Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబు జనాభా విధానం ఖండించతగ్గది

చంద్రబాబు జనాభా విధానం ఖండించతగ్గది

సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కరత్న్యూఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో, నాలుగో బిడ్డల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రోత్సాహక పథకాన్ని సిపిఎం సీనియర్ నేత బృందా కరత్ తీవ్రంగా విమర్శించారు.

ఎక్కువ మంది పిల్లలను కంటే డబ్బులు ఇస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న జనాభా విధానం ఖండించతగ్గదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో, నాలుగో బిడ్డల కోసం ప్రవేశపెట్టిన ప్రోత్సాహక పథకంపై మంగళవారం సిపిఎం సీనియర్ నేత బృందా కరత్ మీడియాతో మాట్లాడారు. 'ఇది తీవ్రంగా ఖండించదగిన చర్య. ఎందుకంటే ఇది ఒక మహిళ స్వేచ్ఛకు, ఆమెకు ఒక బిడ్డ కావాలా, ఇద్దరు కావాలా, వద్దా, లేదా అంతకంటే ఎక్కువ మంది కావాలా అని నిర్ణయించుకునే హక్కుకు భంగం కలిగిస్తుంది.

మీరు ఆ వ్యక్తిగత స్వేచ్ఛను ఆక్రమించి, దానిని రాజకీయ విధానాల కోసం వాడుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉండి, ఇద్దరే కావాలనుకుంటున్న ఒక పేద మహిళ గురించి ఆలోచించండి. మూడో బిడ్డ కోసం రూ.30,000 లేదా నాలుగో బిడ్డ కోసం రూ.40,000 చెల్లించమని ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆమెపై ఒత్తిడి తీసుకురావచ్చు. సహజంగానే, ఆ డబ్బుపై ఆ మహిళకు నియంత్రణ ఉండే అవకాశం లేదు' అని అన్నారు. రాజకీయ అజెండాలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం మహిళల గర్భాలను, పునరుత్పత్తి హక్కులను ఒక సాధనంగా వాడుకుంటోందని ఆమె విమర్శించారు. ఎన్డీఏ నేతృత్వంలోని ఇతర ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్న మహిళలను శిక్షించే లేదా పరిమితం చేసే నిబంధనలను కలిగి ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా నగదు ప్రోత్సాహకాలను ప్రవేశపెడుతోందని ఆమె పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana