Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేతకాని వాళ్లు సవాల్ చేయడమెందుకు?:  కేటీఆర్

చేతకాని వాళ్లు సవాల్ చేయడమెందుకు?: కేటీఆర్

వతెలంగాణ-హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావుకు(Minister Jupally) దమ్ముంటే గన్పార్క్ వద్దే ఉండాలి అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్(KTR challenged) విసిరారు.

రాష్ట్రంలోని అప్పులపై చర్చిద్దామని సవాల్ స్వీకరించిన మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు 11 గంటలకు వస్తానని ఎందుకు రాలేదని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బహిరంగ వేదికల్లో ప్రశ్నించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.చేతకాని వాళ్లు సవాల్ చేయడమెం దుకు? తెలంగాణ భవన్కు వస్తామని ఫోజు కొట్టి పారిపోవడ మెందుకన్నారు. చేతగాని వాళ్లకు మాటలెక్కువ చెల్లని, నాణేనికి గీతలెక్కువ అని ఎద్దేవా చేశారు. నేను గన్పార్క్ వస్తే చార్మినార్ రమ్మంటారేమోనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందే ఇప్పుడు ఏం జరుగుతుందో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మాకు మాట్లాడే టైం ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని నిరూపిస్తామన్నారు.

ఆదానిని మించిపోయేలా అనుముల బ్రదర్స్ సంపాదిస్తున్నారు. 56 వేలు పోలీసులు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు 5 వేల ఉద్యోగాలే వస్తాయని అంటున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 95 శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా చేశామన్నారు. చేతగాని అసమర్ద సర్కార్పై పోరాడుతమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మేము లక్ష ఇండ్లు కట్టించాం కాంగ్రెస్ ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపించినా దేనికైనా సిద్ధమన్నారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలని డిమాండ్ చేశారు.

సంక్షేమ శాఖలో రూ.2000 కోట్ల కుంభకోణంపై హరీష్ రావు ఆరోపణలు చేస్తే చర్చ కోసం ముగ్గురు మంత్రులు గన్ పార్క్ దగ్గరికి రమ్మని అన్నారు

ముగ్గురు మంత్రులతో మాట్లాడడానికి హరీష్ రావు బయలుదేరితే తెలంగాణ భవన్ బయటే అరెస్ట్ చేశారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana