యాప్ లో వివరాలు నమోదు..నవతెలంగాణ - మల్హర్ రావు
చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు ఈ నెల 16తో ముగిసింది.మండల వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 496 దరఖాస్తులు వచ్చాయిని ఎంపిడిఓ క్రాంతికుమార్ తెలిపారు.మండలంలోని ఆయా గ్రామాల్లో ఎంపీడీవో,ఎంపీవో, ఎంఈవో,డిటి,ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ అధికారులను వెరిఫికేషన్ ఆఫీసర్లు నియమించారు.సంబంధిత అధికారులు బుధవారం నుంచి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు.నివాస,సామాజిక,ఆర్థిక పరిస్థితులతోపాటు సంబంధిత పింఛన్ కేటగిరీకి ఉన్న అర్హతలు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.
అర్హతలను నిర్ధారించేందుకు అవసరమైన పత్రాలను పరిశీలిస్తున్నారు. వెరిఫికేషన్ తర్వాతే ఫింఛన్లు మంజూరు చేయనున్నారు.
యాప్లో నమోదు
క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించిన వివ రాలు,దరఖాస్తుదారుడి ఫొటోను మొబైల్ యాప్ లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'చేయూత వెరిఫికే షన్ మొబైల్ యాప్'ను రూపొందించింది. అనర్హుడిగా పేర్కొంటే అందుకు గల కార ణాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. కారణం లేకుండా దరఖాస్తు నిరాకరించడానికి అవకాశం లేదు.అదే సమయంలో అర్హత లేనివారిని పింఛన్ కోసం సిఫారసు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. తప్పుడు ధ్రువీకరణ జరిగినట్లు సామాజిక తనిఖీ, ఆకస్మిక పరిశీలనలో తేలితే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నారు. అలాగే పింఛన్గా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తామని హెచ్చ రించారు.పరిశీలన ప్రక్రియ ఈ నెల 25తో ముగియనుంది. కలెక్టర్ ఆమోదం తర్వాత పింఛన్లు మంజూరు చేయనున్నారు.

