Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చురుకుగా మొక్కజొన్న కొనుగోళ్లు

చురుకుగా మొక్కజొన్న కొనుగోళ్లు

11.54 లక్ష‍ల మెట్రిక్ టన్నులు సేకరణనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

రాష్ట్రంలో యాసంగి మొక్కజొన్న పంట కొనుగోళ్లు చురుకుగా సాగుతున్నాయి. మే 20 నాటికి మొత్తం 11.54 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు పూర్తయింది.

అందులో 9.53 లక్షల మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించింది. ఇంకా 2.01 లక్షల మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించాల్సి ఉంది. రాష్ట్రంలో మొక్కజొన్న ఉత్పత్తి అంచనా 43.18 లక్షల మెట్రిక్ టన్నులు.
ఇందులో 21.59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరుగుతాయని అంచనావేసింది. ప్రభుత్వం జిల్లాల వారీగా మొత్తం 14.89 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. మొక్కజొన్న కొనుగోళ్లలో ఖమ్మం మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఇప్పటివరకు 2.54 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు పూర్తయ్యాయి. తర్వాత స్థానాల్లో నాగర్కర్నూల్ 1.55 లక్షల మెట్రిక్ టన్నులు, వరంగల్ 1.11 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్ 1.05 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు పూర్తయ్యాయి. నిల్వల విషయంలో మొత్తం 15.53 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ అవసరం. ప్రస్తుతం 12.75 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అందుబాటులో ఉంది. ఎక్కడికక్కడే సరిపడే నిల్వ స్థలాలను గుర్తించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అదనంగా 27 వేల మెట్రిక్ టన్నులకు స్థలాన్ని గుర్తించింది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 2.48 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలాన్ని గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్క జొన్న కొనుగోళ్లకు మొత్తం 3.10 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఇప్పటివరకు 2.42 కోట్ల బ్యాగులు సరఫరా అయ్యాయి. ఇంకా 67.84 లక్షల గన్నీ బ్యాగులు సర్దుబాటు చేయనున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్నగర్, నిర్మల్ జిల్లాల్లో హమాలీల కొరత, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రవాణా సమస్యలతో కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana