Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డాక్టర్లు గొర్ల కాపర్లకు అందుబాటులో ఉండాలి: జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి

డాక్టర్లు గొర్ల కాపర్లకు అందుబాటులో ఉండాలి: జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి

వతెలంగాణ - హైదరాబాద్ : భువనగిరి మండల పశువైద్యశాల పరిధిలో గల సబ్ సెంటర్ ల డాక్టర్లు గొర్ల మేకల కాపర్లకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని, జిఎంపీఎస్ ( గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం) జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహా కోరారు.

సోమవారం భువనగిరి మండలంలోని ముస్త్యాల పెల్లి , చీమల కొండూరు, రాయగిరి గొర్రెల మందల ను సందర్శించి, గొర్ల కాపరులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముస్త్యాలపల్లి, చీమల కొండూరు గ్రామానికి సంబంధించిన డాక్టర్ సుమారు 6 నెలల సుమారు ఆరు నెలల నుంచి గొర్ల కాపరులకు అందుబాటులో లేడని, ఫోన్ చేసిన స్పందించడం లేదని ఆరోపించారు.

ఉచిత టీకాలను సకాలంలో పంపిణీ చేయకపోవడం వలన, గొర్ల కాపరులు ప్రైవేట్ మందులను కొనుగోలు చేసి, ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా సబ్ సెంటర్లో ఉన్న డాక్టర్లు ప్రతి ఒక్కరు గొర్ల కాపరులకు, రైతులకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం పంపిణీ చేసే మందులు, ప్రతి టీకాలను వారికి ఉచితంగా పంపిణీ చేసి, వైద్యం అందించాలి. గొర్ల కాపరులకు సీజన్ గా వచ్చే వ్యాధుల మందులను సకాలంలో పంపిణీ చేయాలని కాపర్లు కోరారు. సబ్ సెంటర్ల డాక్టర్లపై పై అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా యంత్రాంగం స్పందించి గొర్ల కాపరులకు సకాలంలో వైద్యం అందించాలి.

రాయగిరి గొర్ల కాపరులకు ప్రధానంగా మందులతో పాటుగా ఉచితంగా ప్రభుత్వ భూములలో 559 జీవో ప్రకారంగా ప్రభుత్వ భూములు, అటవి శాఖ భూములు కాపర్లు మేత మేపుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. గొర్ల కాపరుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేసి, గొర్ల కాపరులను ఆదుకోవాలని నర్సింహా అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల కార్యదర్శి పాక జహంగీర్, మండల అధ్యక్షులు దేవునూరి బాలయ్య, జిల్లా కమిటీ సభ్యులు మన్నెబోయిన రాజలింగం, మండల ఉపాధ్యక్షులు పార్వతి దశరథ, తోటకూర అశోక్, సహాయ కార్యదర్శి వడ్డే జమదగ్ని, ఆయా గ్రామాల సంఘం అధ్యక్షులు వడ్డే రమేష్, చిన్నం శ్రీనివాస్, కాపరులు నారి శ్రీశైలం, వడ్డే బీరయ్య, వడ్డే నరసింహ, మటికేల కొమురయ్య, వడ్డే ఆంజనేయులు, పసనాల అంజయ్య, బోదాసు వెంకటయ్య, కరికె అంజయ్య, మంగపండు బుగ్గ మల్లయ్య, బుగ్గ మల్లయ్య, కరికి బాలరాజు, మన్నేబోయిన ఐలయ్య, కొత్త మల్లేష్, కొత్త నరసింహ, మచ్చ జాంగిర్, చిన్నం జమాల్ లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana