Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డాలర్@96.35

డాలర్@96.35

రింత పాతాళంలోకి రూపాయిన్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ నూతన రికార్డ్ను చవి చూసింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా డాలర్ బలోపేతం కావడం వల్ల భారతీయ రూపాయి సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 54 పైసలు క్షీణించి 96.35 వద్ద ముగిసింది.

ట్రేడింగ్ ప్రారంభంలోనే 96.19 వద్ద బలహీనంగా ఓపెన్ అయి, ఒక దశలో అత్యంత కనిష్టంగా 96.39 మార్కును తాకింది. గడిచిన శుక్రవారం 95.81 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య నిరంతరాయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీ స్తున్నాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. చమురు ధరలు విపరీతంగా ఎగబాకడం వల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి డాలర్లు బయటకు వెళ్లడం భారీగా పెరిగింది; దీనికి తోడు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు కూడా భారత మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ డాలర్లను వెనక్కి తీసుకెళ్తుండటం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. అమెరికా ట్రెజరీ బాండ్ల ఆదాయం పెరగడం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో కూడా రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

​ఐటి స్టాక్స్తో మార్కెట్లకు లాభాలు
పశ్చమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, రూపాయి పతనం భయాలతో ఇంట్రాడేలో వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత ఐటి షేర్ల కొనుగోళ్ల మద్దతుతో భారీగా కోలుకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana