Dailyhunt
డబుల్ బెడ్రూమ్ కోసం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం

డబుల్ బెడ్రూమ్ కోసం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం

వతెలంగాణ-భిక్కనూర్ (రాజంపేట్): డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన రాజంపేట్ పట్టణ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ అహ్మద్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పటికీ తన పేరు డబుల్ బెడ్రూమ్ జాబితాలో వచ్చినా ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పలుమార్లు అధికారులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో ఎమ్మార్వో కాళ్లు మొక్కినా పరిష్కారం లభించలేదని వాపోయాడు.దీంతో తీవ్ర నిరాశకు గురైన మహమ్మద్ అహ్మద్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయగా, అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి, నచ్చజెప్పి సదురు యువకుని కిందికి దించారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేసి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని వేడుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana