Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దద్దరిల్లిన దుబాయి

దద్దరిల్లిన దుబాయి

20 నిమిషాల వ్యవధిలో ఏడు పేలుళ్లు! కారణాలు ధృవీకరించని అధికారులు
ప్రాణ, ఆస్తి నష్టంపై రాని స్పష్టత
యెమెన్ వైపు నుంచి జరిగిన క్షిపణి 
దాడులే కారణం : ఇరాక్ మీడియా

దుబాయి : దుబాయిలోని జెబల్ అలీ పారిశ్రామిక జోన్ - ఓడరేవు ప్రాంతంలో బుధవారం ఉదయం అనేక పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల కారణంగా ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇరవై నిమిషాల వ్యవధిలో కనీసం ఏడు పేలుడు శబ్దాలు వినిపించాయని తెలుస్తోంది. పేలుళ్లకు కారణాలేమిటో అధికారులు ధృవీకరించలేదు. తామే ఈ పేలుళ్లు జరిపామని ఏ గ్రూపు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. కాగా యెమన్ వైపు నుంచి జరిగిన క్షిపణి దాడే పేలుళ్లకు కారణమని కొన్ని ఇరాక్ మీడియా సంస్థలు తెలిపాయి. ఇదిలావుండగా యెమన్ రాజధాని సనాలో కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. వైమానిక దాడులే దీనికి కారణమని కొందరు చెప్పగా క్షిపణి ప్రయోగం కారణమై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు.

దీనిపై కూడా ఎమిరాటి అధికారులు స్పందించలేదు. ఈ పేలుళ్లకు సంబంధించిన దృశ్యాల్ని స్థానికులు వీడియో తీస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఈ పేలుళ్ల కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే ప్రపంచంలోనే భారీ పోర్టు కూడా ఉంది. ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు తెలపలేదు. మరోవైపు యెమెన్ రాజధాని సనాలో కూడా పేలుళ్లు జరిగాయి. యెమెన్ భూభాగంలోకి వైమానిక దాడులు లేదా మిసైల్స్తో జరిపిన దాడుల వల్లే ఈ పేలుళ్లు జరిగాయని యెమెన్ అధికారులు అంటున్నారు. ఈ పేలుళ్ల వల్ల జరిగిన నష్టంపై అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ ఆధీనంలో ఉన్న పర్షియన్ గల్ఫ్ ద్వారా నౌకలు ప్రవేశించి.. ఒమన్ ఆధీనంలో ఉన్న మార్గం నుంచి వెళ్లిపోతాయి. ఈ ఒప్పందం కుదరాలంటే ముందుగా ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి. అయితే, గతంలో ఈ ఒప్పందాన్ని అమెరికా వ్యతిరేకించింది. దీనివల్ల నౌక రవాణా మార్గం మొత్తం ఇరాన్కు వెళ్లిపోతుందని అమెరికా భావించింది. అయితే, ఈసారి అమెరికా సానుకూలంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana