Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దక్ష‍ిణ మధ్య రైల్వే 
మహిళా సంక్ష‍ేమ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు

దక్ష‍ిణ మధ్య రైల్వే 
మహిళా సంక్ష‍ేమ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు

వతెలంగాణ-హైదరాబాద్దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం , ఘన వ్యర్థాల నిర్వహణ వంటి ముఖ్యమైన అంశాలపై సంచాలన్ భవన్లో ఒక సెమినార్ను నిర్వహించింది.

సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ ముఖ్య అతిథిగా ఈ సెమినార్కు విచ్చేశారు. ఎస్.సి.ఆర్.డబ్ల్యు.డబ్ల్యు.ఓ-ఎస్.సి డివిజన్ అధ్యక్షురాలు సంధ్యా గోపాలకృష్ణన్ గారు గౌరవ అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ డి.ఆర్.ఎం డాక్టర్ ఆర్.

గోపాలకృష్ణన్ మాట్లాడుతూ రైల్వే కార్యకలాపాలు, స్టేషన్ల నిర్వహణలో సుస్థిర పద్ధతులను అవలంబించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పర్యావరణ బాధ్యతాయుతమైన ప్రజా సేవలను అందించడంలో నీటి సంరక్షణ శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ అనేవి ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు. ఎస్.సి.ఆర్.డబ్ల్యు.డబ్ల్యు.ఓ-ఎస్.సి డివిజన్ అధ్యక్షురాలు సంధ్యా గోపాలకృష్ణన్ మాట్లాడుతూ దీర్ఘకాలిక పర్యావరణ సుస్థిరతను సాధించడంలో అవగాహన, సామాజిక భాగస్వామ్యం ప్రవర్తనా మార్పుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. మొదటి సాంకేతిక సమావేశాన్ని హైదరాబాద్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుకు చెందిన డాక్టర్ కిరణ్ కుమార్ నిర్వహించారు.

ఆయన వర్షపు నీటి సేకరణ , నీటి రీఛార్జ్ పై మాట్లాడారు. వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జల మట్టాలను మెరుగుపరచడం, సంస్థాగత, ప్రజా ప్రదేశాలలో ఆచరణాత్మక రీఛార్జ్ చర్యలను అవలంబించడం ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. రెండవ సమావేశాన్ని బెళగావిలోని అమూల్య బూంద్ ఫౌండేషన్కు చెందిన డాక్టర్ ఆరతి భండారే నిర్వహించారు. ఆమె రైల్వే స్టేషన్లలో ఘన వ్యర్థాల నిర్వహణపై మాట్లాడారు. వ్యర్థాలను వేరు చేయడం, కంపోస్టింగ్ శాస్త్రీయ పద్ధతిలో పారవేయడం కోసం గల వివిధ విధానాలను ఆమె వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana