Tuesday, 22 Sep, 1.45 pm నవ తెలంగాణ

హోం
దవీందర్ సింగ్ కేసు...బారాముల్లాలో ఎన్ఐఏ దాడులు

హైదరాబాద్ : మాజీ డీఎస్పీ దవీందర్ సింగ్, హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తన దర్యాప్తు వేగాన్ని పెంచింది. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని అనేకప్రాంతాల్లో మంగళవారం ఈ సంస్థ దాడులు నిర్వహించింది. మాజీ ప్రభుత్వ అధికారి రసూల్ వాజా, అతని కుమారుల ఇళ్లలో సోదాలు జరిపినట్టు ఈ సంస్థవర్గాలు తెలిపాయి. రసూల్ కొడుకులైన ముస్తాక్ అహ్మద్ వాజా, ఫరూక్ అహ్మద్ వాజా ఇద్దరూ గతంలో అక్రమ ఆయుధజల సేకరణ, ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ కోసం వాస్తవాధీన రేఖ దాటి వెళ్లారని, ఇప్పటివరకు తిరిగిరాలేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి.అటు-సస్పెండయిన డీఎస్పీ దవీందర్ సీంన్గ్ కథువా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top