Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డయల్ 112 ను 
ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

డయల్ 112 ను 
ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

వతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధిబాధితులు కాల్ చేసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలా డయల్ 112ను రూపొందించినట్టు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

బుధవారం ఐసీసీసీలో డయల్ 112ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఏదైనా ఆపదకు లోనైన సమయంలో సహాయం కోసం 112కు కాల్ చేసిన వెంటనే సంబంధిత విభాగానికి చెందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా ఈ అత్యవసర నెంబర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెంబర్కు ఫైర్, మహిళా భద్రత, తదితర విభాగాలను కూడా అనుసంధానం చేసినట్టు చెప్పారు. ఇందుకోసం ఆధునిక పరిజ్ఞానాన్ని వాడినట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు తక్కువ సమయంలో పోలీసులు అందుబాటులోకి వచ్చేందుకు ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖగోయల్, నగర సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana