Dailyhunt
దేగాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

దేగాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

వతెలంగాణ - ఆర్మూర్ఆలూర్ మండలం దేగాం గ్రామంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇట్టిడి లింగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.

అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అయేషా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందడం చాలా ముఖ్యమని చెప్పారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆరోగ్యం మా మొదటి ప్రాధాన్యం. అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్మపురి, శ్రీనివాస గౌడ్, రాజేశ్వర్, ఏఎన్ఎం లు , ఆశా వర్కర్లు , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana