Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశానికి విద్యావంతుడైన ప్రధాని అవసరం : కేజ్రీవాల్

దేశానికి విద్యావంతుడైన ప్రధాని అవసరం : కేజ్రీవాల్

వతెలంగాణ - హైదరాబాద్ : దేశానికి ఒక విద్యావంతుడైన ప్రధాని అవసరమని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సియుఇటి-యుజి పరీక్షల్లో తలెత్తిన ఇబ్బందులపై ఆయన పై విధంగా స్పందించారు.

దేశానికి ఒక విద్యావంతుడైన ప్రధాని అవసరమని, విద్యావ్యవస్థ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు. నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీని అడ్డుకునేందుకు ఆర్మీ వాహనాలను వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఇది పేపర్ లీకేజీలను అడ్డుకునేందుకు కాదని, కేవలం ప్రదర్శన కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేసిందని మండిపడ్డారు. ఆర్మీ వాహనాలు ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకుంటాయా అని కేంద్రాన్ని నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం నిరక్షరాస్యుల్లాగా వ్యవహరిస్తోందని అన్నారు. పేపర్ లీకేజీలను అడ్డుకునే ఉద్దేశ్యం మోడీ ప్రభుత్వానికి లేదని, విద్యావ్యవస్థ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు. తన ఫిజిక్స్ పేపర్లో అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేసిన 12వ తరగతి విద్యార్థి వేదాంత్ ఉదంతాన్ని కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. బిజెపి ట్రోల్ సైన్యం వేదాంత్ ను ట్రోల్ చేసిందని, అతనిని పాకిస్తానీ అని, దేశద్రోహి అని పిలిచిందని, ఇదంతా విద్యను మాఫియాగా మార్చిన వ్యక్తులను కాపాడుకునేందుకేనని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana