Dailyhunt
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలి

ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలి

మార్కెట్ దోపిడీని అరికట్టాలి మే 4,5,6 తేదీల్లో గ్రామీణ నిరసనలకు సీపీఐ(ఎం) పిలుపు
నవతెలంగాణ - భువనగిరి

వరి ధాన్యం పండించిన రైతుకు ప్రతి సీజన్లో తిప్పలు తప్పడం లేదు.

ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం మరోవైపు మిల్లర్లు 40 కిలోలు కాదు 42 కిలోలు తూకం వేయడం రైతుల్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కొనసాగుతున్నదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కెట్ లో లోడ్ అయిన ధాన్యం మిల్లుకు వెల్లి రోజులతరబడి మిల్లుల వద్ద పడి కాపులు కాయడం చివరికి మిల్లర్ల దయాదాక్షిన్యాల మీద అన్లోడ్ అవుతున్న పరిస్థితి ఉన్నదన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు చేష్టలు అడిగి చేస్తున్నారన్నారు.

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా మిల్లర్లు బేఖాతారు చేస్తున్న స్థితి నెలకొన్నదన్నారు. ప్రభుత్వము చెప్పేది ఒకటి చేసేదొకటిగా ఉన్నదన్నారు. కేవలం పత్రికా ప్రకటనలు చేస్తూ మంత్రులు, ఎం ఎల్ ఏ లు కాలయాపన చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరైనది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే అదనంగా కాంటాలు, లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి. వేసవికాలం మండుటెండల్లో రైతులు మార్కెట్లో ఉండి వడదెబ్బకు తీవ్ర అనారోగ్యం పాలవుతున్న కనీస సౌకర్యాలు లేవు. అందుకే మే 4,5,6 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు సీపీఐ(ఎం) పిలుపు ఇచ్చిందన్నారు. రైతులందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana