Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

వతెలంగాణ-తుంగతుర్తిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని రావులపల్లి,వెంపటి,తుంగతుర్తి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు.రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా,వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మిల్లర్లు 'తరుగు' పేరుతో రైతులను ఇబ్బంది పెడితే,ధాన్యం కొనుగోళ్లలో కోతలు విధిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కొనుగోలు కేంద్రాలలో తూకం పూర్తయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు.

మిల్లులకు చేరిన లారీలు 3 గంటల్లోపు అన్-లోడింగ్ పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి,రెండు రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఐకెపి కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సూర్యతండ మాజీ సర్పంచ్ లకావత్ యాకు నాయక్ కలెక్టర్కు విన్నవించగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ దయానందం,ఎంపీడీవో శేషు కుమార్,ఏడిఏ రమేష్ బాబు,ఏపీఎం యాదమ్మ,స్థానిక ఎస్సై క్రాంతి కుమార్,ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana