Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

వతెలంగాణ - భువనగిరిధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు.

గురువారం భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చి 45 రోజులైనా కనీసం 50% కొనుగోలు కాలేదన్నారు. హమాలీల కొరత, వాహనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం జరుగుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న క్యూ లైన్ ను చూసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక రాకుండా తక్కువ ధరకు తమ ధాన్యాన్ని అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ధాన్యము దిగుమతి, కొనుగోలు, ఎగుమతి విషయాలపై జిల్లా మంత్రులకు స్థానిక ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బి ఆర్ ఎస్ పాలనలో రైతులకు విత్తనాలు ఎరువులు, సబ్సిడీ, రైతు రుణాలు, కొనుగోలు విషయంపై ప్రతి సీజన్లో మూడు నెలల ముందే ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోయే వారన్నారు. రైతులకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ధాన్యాన్ని కొనుగోలు చేయించడంలో విఫలమైనాడని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరిట ధాన్యాన్ని అధికంగా తూకం వేస్తున్నారన్నారు. మిల్లర్లతో కలిసి సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారికి సహకారం అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద మంచినీరు లాంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. మే 31 లోపు ధాన్యము కొనుగోలు పూర్తిగా చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి, జాతీయ రహదారిని దిబ్బందనం చేస్తామన్నారు. రైతుబంధు సకాలంలో ఇవ్వాలన్నారు. విద్యుత్తు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. రాబోయే సీజన్ కు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana